![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -695 లో.... నేనొక నిర్ణయం తీసుకున్నానంటూ శివన్నారాయణ ఇంట్లో అందరిని పిలుస్తాడు. అంతకంటే ముందు మీతో మాట్లాడాలని జ్యోత్స్న అంటుంది. నేను గెలవాలనుకున్నాను కానీ ఎలా గెలిచినా పర్వాలేదని దీపపై అలా కుట్ర చేపించాను.. నేను చేసిన తప్పుకి దీపకి సారీ చెప్పాలనుకుంటున్నానని జ్యోత్స్న అనగానే అందరు షాక్ అవుతారు. ఉన్నట్లుండి మేడమ్ లో ఇంత మార్పు ఏంటోనని కార్తీక్ అంటాడు.
దీప సారీ.... నాకు బావ మీద నమ్మకం ఉంది.. దీపకి ఎలాంటి హెల్ప్ చెయ్యడని మీరు ఇక ఇంటికి వెళ్లొచ్చు బావ అని జ్యోత్స్న అనగానే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. మరి అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేయమని కాంచన అంటుంది. అది చెయ్యను ఎందుకంటే బావే కదా నా పెళ్లి చేస్తానని బాధ్యత తీసుకున్నాడని జ్యోత్స్న అంటుంది. దీపకి జ్యోత్స్న సారీ చెప్పకపోయింటే నా నిర్ణయం చెప్దామనుకున్నాను కానీ ఇప్పుడు అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత దాని నిర్ణయం మారకముందే మనం వెళ్ళిపోదామని కాంచన అంటుంది. ఆ తర్వాత ఏంటి పారు పార్టీ మార్చినట్లున్నావని కార్తీక్ అనగానే అదేం లేదురా దానికి డౌట్ వస్తుందని అలా చేసానంతే అని పారు అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. మీ అమ్మ అన్నదానికి మురిసిపోతున్నట్లున్నావని జ్యోత్స్న అంటుంది. ఏం చేసినా సుమిత్ర కూతురు దీప అని కార్తీక్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఏమంటున్నావ్ రా అని అడుగుతాడు. దాంతో కార్తీక్ కవర్ చేస్తాడు.
ఆ తర్వాత జ్యోత్స్న, శివన్నారాయణ ఆఫీస్ కి వెళ్తుంటారు. నువ్వు అసలు నా మనవరాలు కాదని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న షాక్ అయి కార్ ఆపుతుంది. అంటే నువ్వు ఎవరివి.. నా వారసత్వం అని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న రిలాక్స్ అవుతుంది. రౌడీ లు జ్యోత్స్న దగ్గరికి వస్తారు. ఎవరు వాళ్ళు అని శివన్నారాయణ అడుగుతాడు. ఏదో చందా కోసమని జ్యోత్స్న అంటుంది. కార్ దిగి వాళ్ళతో మాట్లాడుతుంది జ్యోత్స్న. మీరు చెప్పింది చేసాం.. యాభై లక్షలు ఇవ్వండి అని జ్యోత్స్నని అడుగుతారు. ఇవ్వను అనేసరికి జ్యోత్స్నను తీసుకొని వెళ్ళాలనుకుంటారు. అది శివన్నారాయణ చూస్తాడు. వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాడు శివన్నారాయణ. రౌడీలు గొడవ చేస్తారు. అప్పుడే సూరజ్ వచ్చి జ్యోత్స్న, శివన్నారాయణ వాళ్ళని సేవ్ చేస్తాడు. మరోవైపు ఇంకా సూరజ్ రాలేదని దీప చూస్తుంటుంది. శివన్నారాయణ తన దగ్గరికి వెళ్లి తన కాలికి గాయం అయిందని జరిగింది చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |